News May 20, 2024

చట్టపరంగా ఎటువంటి తప్పు చేయలేదు: విష్ణుకుమార్ రాజు

image

చట్టపరంగా, న్యాయపరంగా తాను ఎటువంటి తప్పు చేయలేదని విశాఖ నార్త్ BJP MLA అభ్యర్థి <<13279687>>విష్ణుకుమార్ రాజు<<>> అన్నారు. నగరంలోని బర్మా కాలనీలో రెండు కుటుంబాల మధ్య దాడికి సంబంధించి కేసును తప్పుదోవ పట్టించారని పోలీసులు ఆయనకు 41-ఏ నోటీసులు అందజేశారు. దీనిపై ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ బెయిలు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

Similar News

News July 6, 2025

కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం: కె.కె రాజు

image

వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో గాజువాక జగ్గు జంక్షన్ వద్ద ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ పేరుతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పథకాలు అమలులో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News July 6, 2025

‘విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో కొత్త బ్యారక్’

image

ఏపీలో ఉన్న వివిధ జైళ్లను రూ.103 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జైళ్ల శాఖ ఐజీ డా.ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్‌ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రూ.10 కోట్లతో 250 మంది సామర్థ్యం గల కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ జైలుని సందర్శించిన ఆయన ఈ మేరకు వివరాలు తెలియజేశారు.

News July 6, 2025

గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 2

image

➦ అనకాపల్లి నుంచి సిటీ వైపు వచ్చే భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ నుంచి సబ్బవరం మీదుగా ప్రయాణం చేయాలి.
➦09 తేదీ ఉదయం 6 నుంచి అడవివరం, గోపాలపట్నం పెట్రోల్ బంక్ మధ్య వాహనాలకు నో ఎంట్రీ. దువ్వపాలెం, అక్కిరెడ్డిపాలెం, వేపగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించాలి
➦అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళు వాహనాలు విశాఖ సిటీలోకి అనుమతి లేదు. లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్ళాలి.