News February 2, 2025
చనిపోయే ముందు తణుకు ఎస్ఐ చాటింగ్..?

తణుకు ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూం వద్ద ఆయన గన్‌తో కాల్చుకున్నారు. సూసైడ్ చేసుకునే ముందే ఆయన ఫోనులో ఎవరితోనో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత దృశ్యాలు స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్ఐ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ చాటింగ్ బయట పెడితేనే వాస్తవాలు వెల్లడవుతాయని బంధువులు అంటున్నారు.
Similar News
News September 19, 2025
ఫిరాయింపులపై CM రేవంత్ కామెంట్.. చట్టం ఏం చెబుతోంది..?

రాజ్యాంగ సవరణ-52తో 1985లో చేర్చిన పదో షెడ్యూల్‌లో ఫిరాయింపుల గురించి ఉంది. శాసన సభ్యులు ఎన్నికైన పార్టీకి రిజైన్ చేస్తే ఫిరాయించినట్లు. ఓటింగ్‌కు హాజరుకావాలని విప్ జారీ చేస్తే రాకపోయినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా స్పీకర్/ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసి తొలగింపజేయొచ్చు. గెలిచాక మరో పార్టీలో చేరినా ఫిరాయింపే అని ఉన్నా.. <<17762540>>చేరారు<<>> అనే నిర్ధారణ వివరించలేదు. స్పీకర్ విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు.
News September 19, 2025
మైథాలజీ క్విజ్ – 10 సమాధానాలు

1. శ్రీరాముడి పాదధూళితో ‘అహల్య’ శాపవిముక్తురాలైంది.
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని చంపింది ‘సహదేవుడు’.
3. కృష్ణద్వైపాయనుడు అంటే ‘వేద వ్యాసుడు’.
4. మధుర మీనాక్షి దేవాలయం ‘వైగై నది’ ఒడ్డున ఉంది.
5. చిరంజీవులు ఏడుగురు. వారు 1. అశ్వత్థామ 2. బలి చక్రవర్తి 3. వ్యాస మహర్షి 4. హనుమంతుడు 5. విభీషణుడు 6. కృపాచార్యుడు 7. పరశురాముడు <<-se>>#mythologyquiz<<>>
News September 19, 2025
విద్యారంగంలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలి: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లాను విద్యారంగంలో ఉన్నతస్థాయిలో నిలపాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం సరస్వతి శిశుమందిర్‌లో నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్ బోధనాభ్యాసన సామగ్రి మేళాను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే ఉన్నత విద్యలో రాణిస్తారని అన్నారు. విద్యార్థులను ఆకర్షించడానికి అభ్యసన సామగ్రిని తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.