News April 7, 2025

చపాతీలు చేయలేదని చితకబాదిన టీచర్

image

చపాతీలు చేయనందుకు విద్యార్థినులను చితక్కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం టౌన్ రామవరం గిరిజన బాలికల గురుకులంలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు 8వ తరగతి విద్యార్థినులను చపాతీలు చేసేందుకు ఓ టీచర్ నిద్రలేపింది. కొందరు లేచి చపాతీలు చేస్తుండగా, 21 మంది విద్యార్థినులు నిద్ర లేవలేదు. ఆ సాకుతో ఈ 21 మందిని గదిలో కర్రతో చితక బాదిందని పేరెంట్స్ ఆందోళన చేశారు.

Similar News

News February 22, 2026

ప్రకాశం: ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్

image

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లాలోని 79 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News February 22, 2026

BREAKING: లొంగిపోయిన దేవ్‌జీ

image

ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి <<19197693>>సరెండర్<<>> అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIB ముందు లొంగిపోయారు. మార్చి 31నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్‌జీ, రాజిరెడ్డి టార్గెట్‌గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

News February 22, 2026

స్వర్ణోత్సవాలకు కేయూ సిద్ధం..!

image

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. ఉన్నత విద్యను అందిస్తూ NAAC నుంచి A+ గ్రేడ్ గుర్తింపు పొందింది. 27 విభాగాలు, అనేక అనుబంధ కళాశాలలతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్, సైన్స్‌లో సుమారు 95+ కోర్సులను అందిస్తోంది. UG, PG, Ph.Dతో పాటు SDLCE ద్వారా దూరవిద్య కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 473కు పైగా అనుబంధ కళాశాలున్నాయి.