News March 1, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 1)

* 1901: ఆంధ్రరాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1951: బిహారీ సీఎం నితీశ్ కుమార్ జననం (ఫొటోలో)
* 1955: తెలుగు భాషావేత్త వెలమల సిమ్మన్న జననం
* 1986: సింగర్ ఎన్.సీ.కారుణ్య జననం
* 1989: మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మరణం
* ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
* జీరో డిస్క్రిమినేషన్ డే
Similar News
News March 2, 2026
పాకిస్థాన్‌పై విరాట్ అద్భుతం చేశారు: రోహిత్

2022 T20WCలో పాకిస్థాన్‌పై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు. ‘160 పరుగుల టార్గెట్ ఛేదనలో 31కే 4 వికెట్లు పడిపోయాయి. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశగా ఉండిపోయా. అప్పుడు కోహ్లీ అద్భుతం చేశారు. అసలు మేం గెలిచే స్థితిలోనే లేము. అలాంటి ఇంపార్టెంట్ సిచ్యుయేషన్‌లో కోహ్లీ దాన్ని సుసాధ్యం చేశారు. నేను ఆడిన క్రికెట్ మ్యాచుల్లో అదొక గొప్ప ఆట’ అని ICC ఇంటర్వ్యూలో చెప్పారు.
News March 2, 2026
ఖమేనీ భార్య మృతి

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ <<19281898>>భార్య<<>> కూడా మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఫిబ్రవరి 28న మిస్సైల్ దాడిలో గాయపడ్డ మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ కోమాలోకి వెళ్లారు. కాసేపటి క్రితం ఆమె మరణించినట్లు తెలుస్తోంది. 1947లో జన్మించిన మన్సౌరే 17 ఏళ్ల వయసులో అంటే 1964లో ఖమేనీని పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్ల పాటు ఇరాన్ ఫస్ట్ లేడీగా ఉన్న ఆమె అత్యంత రహస్య జీవితాన్ని గడిపారు.
News March 2, 2026
నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలి: CM CBN

AP: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశమివ్వాలని CM CBN ఆదేశాలు జారీ చేశారు. RTGS, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై సమీక్షించిన ఆయన, ఈ నెల నుంచి పబ్లిక్ పర్సెప్షన్ 80-90%కి తగ్గకుండా ఉండాలన్నారు. ‘అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్ల మరమ్మతులు పూర్తి చేయాలి. పెన్షన్ల పంపిణీ, ‘దీపం’ సిలిండర్ల డెలివరీ, స్వర్ణ గ్రామాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని ఆఫీసర్లకు సూచించారు.


