News March 2, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 2)

* 1933: బాలీవుడ్ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఆనంద్‌జీ వీర్జీ షా జననం
* 1936: రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
* 1962: తెలంగాణ కవి యాకూబ్ జననం
* 1938: నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
* 1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల సరోజిని నాయుడు మరణం (ఫొటోలో)
* 1990: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా మంత్రి మసూమా బేగం మరణం
Similar News
News March 2, 2026
అరామ్‌కోపై ఇరాన్ దాడి.. ప్రభావమెంత?

సౌదీ <<19278592>>అరామ్‌కో<<>>కు చెందిన రాస్ తనూరా రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి, ఎగుమతి కేంద్రం. ఇక్కడ రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేస్తారు. 3.3 కోట్ల బ్యారెళ్ల చమురును నిల్వ చేసే వసతులు ఉన్నాయి. అత్యాధునిక లోడింగ్ బెర్తులు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌తో కూడిన ఈ పోర్ట్ ద్వారా గ్లోబల్ ఆయిల్ డిమాండ్‌లో దాదాపు 7% ఎగుమతులు జరుగుతాయి. దీంతో ఆయిల్ ధరలు భారీగా పెరిగే ఆస్కారముంది.
News March 2, 2026
కుసుమ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యాసంగి పంటగా విత్తుకున్న కుసుమ.. నాటిన సమయాన్ని బట్టి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. కొన్నిచోట్ల ఇది కోత దశలో ఉంది. అయితే ఈ కుసుమ పంటను ఉదయాన్నే కోయడం వల్ల గింజలు రాలడం తక్కువగా ఉండటమే కాకుండా ముల్లు మొత్తగా ఉండి కోత ప్రక్రియ ఈజీగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట కోత తర్వాత గింజలలో తేమ 5 నుంచి 8 శాతానికి వచ్చేవరకు ఆరబెట్టాలి. దీని వల్ల గింజ నాణ్యత బాగుంటుందని తెలిపారు.
News March 2, 2026
ప్రభుత్వ ఉద్యోగులకోసం కొత్త చట్టం

TG: తలిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతం నుంచి 10-15% కోత పెట్టి వారికి చెల్లించేలా చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. పేరెంట్స్ ఫిర్యాదులపై విచారణ చేసి నిజమని తేలితే వారి జాయింట్ ఖాతాలో ఈ సొమ్ము జమచేయనుంది. CS రామకృష్ణారావు, మాజీ CS శాంతికుమారిలతో కూడిన కమిటీ ముసాయిదా చట్టాన్ని రూపొందిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించనుంది. 2023 నుంచి నియమితులైన వారికి ఈ చట్టం వర్తించనుంది.


