News March 1, 2026

చరిత్ర పుటల్లో గద్వాల రాజకుమారి వివాహ వైభవం

image

ఆందోల్-పాపన్నపేట సంస్థానాధీశుడితో గద్వాల సంస్థానాధీశుల కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గద్వాల రాజులు తన కుమార్తెకు అపురూపమైన కానుకలను అరణంగా సమర్పించారు. ఇందులో ముఖ్యంగా పచ్చల హారం ధరించిన తెల్లని పంచకళ్యాణి గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ గుర్రానికి ఒక కాలికీ వెండి, మరో కాలికీ బంగారు కడియాలు అమర్చారు. కేవలం కానుకలే కాకుండా, భారీ సంఖ్యలో దాసదాసీలు 3 వేల మంది సైనికులు కూడా వెళ్లారు.

Similar News

News April 13, 2026

బేబీ మసాజ్‌కు ఈ ఆయిల్స్ ఉపయోగిస్తే మంచిది

image

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.

News April 13, 2026

మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు

image

మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి పుష్కరణి వద్ద చక్రత్ ఆళ్వార్‌తో కలిపి పంచామృతాలతో స్నపన తిరుమంజసం తదుపరి చక్రస్నానం మహోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పుష్పయాగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News April 13, 2026

TU: ఇంటిగ్రేటెడ్ పీజీ రీవాల్యుయేషన్‌కు రెండు రోజులే గడువు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH/IMBA) విద్యార్థులు ఏప్రిల్‌లో విడుదల చేసిన 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాల రీవాల్యుయేషన్‌కు సంబంధిత కళాశాలల్లో మరో రెండు రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ తెలిపారు. సంబంధిత కళాశాలలు ఈ నెల 16లోపు పరీక్షల విభాగంలో దరఖాస్తులను అందజేయాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.