News January 25, 2026
చరిత్ర, ప్రకృతి, ప్రగతిల సమాహారం.. మన పెద్దపల్లి!

పెద్దపల్లి జిల్లా అరుదైన చారిత్రక, భౌగోళిక విశిష్టతలకు నిలయం. 12వ శతాబ్దంలో కాకతీయుల రెండో రాజధానిగా వెలిగిన రామగిరి ఖిల్లా, ప్రాచీన ధూళికట్ట బౌద్ధ స్థూపం ఇక్కడ జిల్లా ఘనతను చాటుతున్నాయి. గోదావరి, మానేరు నదుల కలయికతో పాటు, రాజధాని దాహార్తిని తీర్చే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇక్కడే ఉంది. అటు ఎన్టీపీసీ వెలుగులు, ఇటు సింగరేణి నల్లబంగారంతో ఈ జిల్లా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది.
Similar News
News February 20, 2026
ఫోన్ పే, GPayలో లంచాలు.. 8 మంది ఆఫీసర్లపై వేటు!

TG: వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటున్న విద్యుత్ అధికారులపై TGSPDCL సీఎండీ ముషారఫ్ చర్యలు తీసుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్, కొత్త కనెక్షన్లు, రెగ్యులర్ సర్వీసులకూ డబ్బు వసూలు చేసిన 8 మందిని సస్పెండ్ చేశారు. ఇందులో ఒక ADE, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు. దక్షిణ డిస్కమ్ పరిధిలో 150కి పైగా ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపారు. ఆ 8 మంది ఫోన్ పే, GPay ద్వారా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు.
News February 20, 2026
పి.గన్నవరం: అనుమానాస్పద స్థితిలో టెన్త్ విద్యార్థిని మృతి

ముంగండ ZPH స్కూల్ 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని స్కూల్ సమీపంలోని మంచినీటి చెరువులో కనుగొన్నారు. సాయంత్రం వరకు స్కూలు ప్రాంగణంలో వాలీబాల్ ఆడిందని సహచర విద్యార్థులు తెలిపారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అనుమానం వచ్చి చెరువును పరిశీలించగా కరుణ మృతదేహం లభ్యమయింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 20, 2026
ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లు!

ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లను అలవరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘నిద్ర లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా గడపండి. 10 నిమిషాలు ఎండలో ఉండండి. తిన్నాక 10 నిమిషాలు నడవండి. వారంలో 3 సార్లయినా పెరుగు, యోగర్ట్, కెఫీర్ తీసుకోండి. మందు, సిగరెట్లు వద్దు. పసుపు, జీలకర్ర, సోంపు, మిరియాలను ఆహారంలో చేర్చుకోండి. 12 గం. భోజన సమయాన్ని ఫాలోకండి.. మిగతా 12 గం. ఏమీ తినొద్దు. 7-8 గంటలు నిద్రపోండి’ అని చెబుతున్నారు.


