News January 22, 2026

చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’

image

ర్యాన్ క్లూగర్ డైరెక్షన్‌లో మైఖేల్ బి.జోర్డాన్ నటించిన ‘సిన్నర్స్’ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా ఆస్కార్ నామినేషన్స్‌లో 16 కేటగిరీల్లో చోటు దక్కించుకుంది. గతంలో All About Eve(1950), Titanic(1997), La La Land(2016) 14 కేటగిరీల చొప్పున నామినేషన్స్‌లో నిలిచాయి. ఇప్పుడు వాటి రికార్డును సిన్నర్స్ బద్దలుకొట్టింది. హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ అందుకుంది.

Similar News

News January 26, 2026

బీర సాగుకు అనువైన విత్తన రకాలు

image

బీర పంటలో మంచి దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక ముఖ్యం. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రూపొందించిన అర్క సుజాత, అర్క ప్రసన్న, అర్క సుమిత్, అర్క విక్రమ్ వంటి రకాలతో పాటు.. సురేఖ, సంజీవని, మహిమ, ఎన్.ఎస్-3(NS-3), ఎన్‌.ఎస్‌.401 (NS-401), ఎన్.ఎస్.403 (NS-403), అర్జున్, లతిక, మల్లిక, నాగ వంటి హైబ్రిడ్ రకాలతో మంచి దిగుబడులను సాధించవచ్చు. మీ ప్రాంతాన్ని బట్టి నిపుణుల సూచనలతో వీటిలో రకాలను ఎంపిక చేసుకోవాలి.

News January 26, 2026

వాహనాలపై అలాంటి స్టిక్కర్లు వేస్తే..

image

TG: వాహనాలపై పోలీస్‌, ప్రెస్‌, అడ్వకేట్‌ వంటి వివిధ హోదాల స్టిక్కర్ల వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అనధికారికంగా ప్రభుత్వ చిహ్నాలు, జెండాలు, వృత్తి పేర్లు వాడితే చర్యలు తప్పవని I&PR స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక ఆదేశాలు జారీ చేశారు. నంబర్‌ ప్లేట్లపై ఎలాంటి రాతలు ఉండకూడదని హెచ్చరించారు. అక్రెడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘PRESS’ అనే పదాన్ని ఉపయోగించాలన్నారు.

News January 26, 2026

ఇతరుల అగ్గిపెట్టెతో దీపం వెలిగిస్తున్నారా..?

image

దీపారాధన చేసేటప్పుడు ఇతరుల అగ్గిపెట్టెను వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది శుభప్రదం కాదంటున్నారు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేరుతుందని అంటున్నారు. ‘వెలుగుతున్న ఇతర దీపాలతోనూ దీపారాధన చేయకూడదు. సొంతంగా కొన్న అగ్గిపెట్టెనే వాడాలి. అలాగే స్నేహితులు, చుట్టాలతో గుడికి వెళ్లినప్పుడు పూజా సామగ్రి కూడా సొంత డబ్బుతోనే కొనుగోలు చేయాలి. అప్పుడే ఆ పుణ్యం మీకొస్తుంది’ అని చెబుతున్నారు.