News March 4, 2026

చరిత్ర సృష్టించిన T20WC

image

T20WC-2026 ఘన విజయం సాధించినట్లు ICC ఛైర్మన్ జై షా వెల్లడించారు. ‘క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తం చేసే లక్ష్యంతో ఈ వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఇండియాలో WC వీక్షకుల సంఖ్య 500 మిలియన్లను దాటింది. ఏ T20WCకైనా ఇదే అత్యధికం. జియో హాట్‌స్టార్‌లోనూ 60.5 మిలియన్ల గరిష్ఠ స్థాయికి వ్యూయర్ల సంఖ్య చేరింది. ఇవాళ్టి నుంచి జరిగే సెమీస్ మ్యాచ్‌లు మరిన్ని రికార్డులు బద్దలు కొడతాయని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News April 5, 2026

బంగ్లాదేశ్ సరిహద్దులో పాములు, మొసళ్లతో రక్షణ!

image

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ కోసం మొసళ్లు, విషపూరితమైన పాములను ఉంచాలని BSF యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫెన్సింగ్ వేయడం సాధ్యం కాని 175 కి.మీ మేర వీటితో రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే BSFకు సిబ్బంది కొరత ఉండగా ఆ సమస్య కూడా తీరుతుందని భావిస్తున్నారు. కాగా బంగ్లాతో మనకు 4,096 KM సరిహద్దు ఉండగా ఇప్పటివరకు 3,240 KM మేర ఫెన్సింగ్ వేశారు.

News April 5, 2026

15 ఏళ్లకే పోర్న్ సైట్‌లో నా ఫొటో పెట్టారు: జాన్వీ

image

డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల 15 ఏళ్లకే తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు హీరోయిన్ జాన్వీ కపూర్ వెల్లడించారు. పోర్న్ వెబ్‌సైట్‌లో తన మార్ఫ్‌డ్ ఫొటోలను అప్‌లోడ్ చేశారని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘తోటి స్టూడెంట్స్ ఆ సైట్స్ ఓపెన్ చేసినప్పుడు అవి కనిపించాయి. ఆ విషయాన్ని నాకు చెప్పడంతో బాధపడ్డా. సోషల్ మీడియాలో నైతికత లేదని అర్థమైంది. ఇప్పటికీ డీప్ ఫేక్ కారణంగా సమస్యలు వస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 5, 2026

SRH చెత్త రికార్డు

image

హైదరాబాద్ వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH చెత్త రికార్డులను మూటగట్టుకుంది. తొలి 10 ఓవర్లలో అత్యల్ప స్కోరు(35/4) చేసిన జట్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-3లో KKR(31/3)vs డెక్కన్ ఛార్జర్స్, RR(32/5)vs RCB, MI(32/4)vsKXIP ఉన్నాయి. అలాగే సన్ రైజర్స్‌కు పవర్ ప్లేలో ఇదే నాలుగో లోయెస్ట్ స్కోర్(22/3). గతంలో 14/3vsRR, 20/3vsPBKS, 21/3vsRR అత్యల్ప స్కోర్లు చేసింది.