News February 19, 2025

చ‌రిత్ర సృష్టించి 11 ఏళ్లైంది: హ‌రీశ్‌రావు

image

స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా 11 ఏళ్ల క్రితం నవ చరిత్రకు పునాది పడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కృషి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజది. దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మంగ‌ళ‌వారం ట్వీట్‌ చేశారు.

Similar News

News February 20, 2025

మెదక్ జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ముందస్తు అరెస్టులు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ (రెగ్యులర్) చేయాలన్న పిలుపుతో ఆర్టిజన్ ఉద్యోగులు చలో హైదరాబాద్ విద్యుత్ సౌదాకు పిలుపునిచ్చారు. యూనియన్ నాయకుల పిలుపుమేరకు చలో విద్యుత్ సౌదా వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

News February 20, 2025

సంగారెడ్డి: కల్లు కోసం వచ్చి స్నేహితులు మృతి

image

జిన్నారం PS పరిధిలో<<15514933>> చెరువులో మునిగి<<>> ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల వివరాలిలా.. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్‌కు చెందిన స్నేహితులిద్దరూ నరేష్, శంకర్ మంగళవారం సాయంత్రం వావిలాలలో కల్లు తాగేందుకు బైక్ పై వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో ఈత కొట్టేందుకు పీర్ష చెరువులోకి దిగి మునిగిపోయారు. ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహాలు నిన్న దొరికాయి. స్నేహితులిద్దురి మృతి గ్రామంలో విషాదం నింపింది.

News February 20, 2025

సంగారెడ్డి: వర్సిటీ ప్రొఫెసర్ ఆత్మహత్య

image

సంగారెడ్డి జిల్లా కంకోల్‌లోని వోక్స్ వ్యాగన్ వర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనర్ ప్రొఫెసర్ సుమంత్ కుమార్(36) సూసైడ్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 12 అయినా సుమంత్ క్లాస్‌‌కు రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న మునిపల్లి SI రాజేశ్ నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని సదాశివపేట ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఝర్ఖండ్‌లో సుమంత్ ఫ్యామిలీకి సమాచారం ఇచ్చారు.

error: Content is protected !!