News December 7, 2025

చర్లపల్లి స్టేషన్‌లో రూ.91.92 కోట్లతో భారీ ప్రాజెక్ట్!

image

చర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు భాగ అభివృద్ధి, ప్రవేశమార్గాల కోసం TSIIC Rs 91.91 కోట్లు కేటాయించింది. ఈ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. లెఫ్ట్/రైట్ వింగ్ అమేనిటీ భవనాలు, 2×11.5మీ. క్యారేజ్‌వే రోడ్లు, సర్వీస్ రోడ్లు, 11kV సబ్-స్టేషన్, 1500KVA DG సెట్, 1250KVA ట్రాన్స్‌ఫార్మర్‌లు, 250 KLD వాటర్ ట్యాంక్, 500 KLD STP, ల్యాండ్‌స్కేపింగ్‌తో సహా ఈ ప్రాజెక్టు చర్లపల్లిని కీలక రవాణా కేంద్రంగా మార్చనుంది.

Similar News

News April 14, 2026

సిద్ధు జొన్నలగడ్డతో Freedom oil కొత్త టీవీ ప్రకటన

image

Freedom రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తమ సరికొత్త ప్రచార చిత్రాన్ని ప్రముఖ నటుడు సిద్ధు జొన్నలగడ్డతో విడుదల చేసింది. ‘ఫ్రీడమ్‌తో ఇంటింటా, నెం.1 వంట’ అనే నినాదంతో రూపొందిన ఈ ప్రకటన తెలుగు కుటుంబాల వంటగదిలోని ఆప్యాయతను, సందడిని ఆవిష్కరిస్తోంది. వంట చేయడం అనేది ఒక వేడుక అని చాటిచెప్పే ఈ వీడియోలో సిద్ధు తనదైన శైలిలో ఉత్సాహంగా కనిపించారు. నాణ్యమైన రుచికి Freedom బ్రాండ్ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

News April 14, 2026

మూసీ ప్రక్షాళనకు అడుగులు.. DPR కోసం టెండర్ల ఆహ్వానం

image

మూసీ నదికి పునర్జీవం పోసేందుకు కసరత్తు మొదలైంది. బాపూఘాట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి వరకు 34 కిలోమీటర్ల మేర నాలా సీవర్ మళ్లించి, శుద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం DPR తయారీకి MRDCL టెండర్లను ఆహ్వానించింది. గతంలో HMWSSB రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను లోతుగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు లేదా పునరావృత అంశాలు ఉన్నాయో? లేదో? కన్సల్టెంట్ సంస్థ గుర్తించాల్సి ఉంటుంది.

News April 14, 2026

HYDలో 40 దాటింది.. జాగ్రత్త!

image

HYDలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. నాంపల్లి పరిధిలోని బేగంబజార్ ప్రాంతంలో మంగళవారం గరిష్ఠంగా 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముషీరాబాద్, మారేడ్‌పల్లిలో, హిమాయత్‌నగర్ ప్రాంతంలో హిమాయత్‌నగర్ ప్రాంతంలో 40.5-40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
SHARE IT