News November 6, 2025

చర్ల: ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

image

తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. తాళ్లగూడెం ఠాణా పరిధిలోని అన్నారం, మరిమల్ల గ్రామాల సమీప అడవుల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు ముగిసిన అనంతరం ఘటనా స్థలానికి వెళ్లిన భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 6, 2025

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ జానకి రామయ్య మృతి

image

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య (93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారు రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించిన మండవ, పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News November 6, 2025

ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2025

SRSP UPDATE: 21,954 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

image

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 21,954 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఉదయం 9 గంటలకు 4 గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు వెల్లడించారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.