News February 24, 2026
చలాన్ కట్టే బదులు.. హెల్మెట్ పెట్టుకోండి: రామగుండం సీపీ

రోడ్డు భద్రతే లక్ష్యంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేని వారికి చలాన్లకు బదులు హెల్మెట్లు పంపిణీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామ్ రెడ్డి, ఏసీపీలు రమేష్, శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వరరావు, అనిల్, సత్యనారాయణ, SIలు రమేష్, హరిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చలాన్ల కంటే మీ ప్రాణాలే మాకు ముఖ్యమన్నారు.
Similar News
News February 26, 2026
మోదీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత ఇరాన్‌పై అమెరికా దాడి: ఒవైసీ

మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గాజా మారణహోమానికి నెతన్యాహునే కారణమని ఆరోపించారు. ఆయన్ని ‘యుద్ధ నేరస్థుడి’గా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని మోదీ కౌగిలించుకోవడమేంటి అని ప్రశ్నించారు. ఇది పాలస్తీనాకు భారత్ అందించే చిరకాల మద్దతును దెబ్బతీయడమేనని విమర్శించారు.
News February 26, 2026
ASF: విద్యుత్ ఫిర్యాదులు వాట్సాప్‌లోనే

ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్ బాట్ ప్రారంభించిందని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడే తెలిపారు. 7901628348కు వాట్స్ఆప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. ట్రాక్, ఏజెంట్‌తో చాట్ చేయవచ్చు. సర్వీస్ నంబర్‌తో ఫిర్యాదు ID వెంటనే వస్తుంది. పరిష్కారం తర్వాత SMS/IVRS ద్వారా సమాచారం అందుతుందన్నారు.
News February 26, 2026
కట్టకొక కంకి లేతైనా పుట్టికి ఏదుంతరుగు

పంట పండే సమయంలో ప్రతి మొక్కకు (కట్టకు) ఉండే కంకి గట్టిపడకుండా, పాలు పోసుకునే దశలో లేదా లేతగా ఉంటే, గింజ బరువు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటను అమ్మితే ఆశించిన బరువు రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అంటే పంట కేవలం సంఖ్యలో (కంకులు) ఎక్కువగా ఉంటే సరిపోదు, గింజ ముదిరి గట్టిగా ఉంటేనే రైతుకు సరైన బరువు, తద్వారా లాభం వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.


