News December 18, 2025
చలికాలంలో గుండెపోటు ముప్పుకు ఈ టిప్స్‌తో చెక్!

చలితోపాటు కాలుష్యం ఎక్కువగా ఉండే తెల్లవారుజాము, అర్ధరాత్రి వేళల్లో బయటకు వెళితే గుండెపోటు ముప్పు ఎక్కువవుతుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఎక్సర్‌సైజులు చేసుకోవాలి. ఛాతీ, మెడ, తల కవర్ చేసేలా దుస్తులు ధరించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ముఖ్యం. పొగమంచు ఎక్కువగా పడుతుంటే మాస్క్ పెట్టుకోవాలి. గాలిలో హానికర కణాల నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు వాడాలి.
Similar News
News December 19, 2025
సమయం వచ్చేసింది.. టికెట్లు బుక్ చేసుకోండి!

శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, స్వామిని అతి సమీపం నుంచి దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇదే అవకాశం! 2026 మార్చి నెలకు సంబంధించి సేవా టికెట్ల ఆన్‌లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను TTD నిన్న ప్రారంభించింది. రేపు ఉదయం 11 గంటలకు ముగియనుంది. ఇందులో ఎంపికైనవారు శ్రీవారి మూలవిరాట్టును కేవలం 9 అడుగుల దూరం నుంచి దర్శించుకుంటారు. శ్రీవారి కృపకు పాత్రులు కావాలనుకునేవారు <
News December 19, 2025
జనవరి 13 నుంచి పతంగుల పండుగ

TG: సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జనవరి 13 నుంచి 18 వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరగనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా డ్రోన్, హాట్ ఎయిర్ బెలూన్ షోలనూ ఏర్పాటు చేయనున్నారు. 13-15 మధ్య కైట్, స్వీట్, 13,14 తేదీల్లో డ్రోన్, 16-18 మధ్య హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ జరుగుతాయని టూరిజం స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ తెలిపారు.
News December 19, 2025
వనరాజా కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

పెరటి కోళ్ల పెంపకానికి ‘వనరాజా’ మరో అనువైన రకం. ఇవి అధిక సంఖ్యలో గుడ్లు, అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10-12 వారాల వయసులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5 నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్నిస్తాయి. పెట్టకోడి ఏటా 150 గుడ్లను పెడుతుంది. ఇది కుక్కలు, పిల్లుల బారి నుంచి త్వరగా తప్పించుకుంటుంది.


