News October 26, 2025

చల్వాయి, గోవిందరావుపేట షాపులకు డ్రా నిలిపివేత..!

image

ములుగు జిల్లాలోని చల్వాయి, గోవిందరావుపేట మద్యం దుకాణాలకు డ్రాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భూపాలపల్లి ఈఎస్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి, ములుగు జిల్లాలోని షాపులకు డ్రా జరుగుతోందని, కానీ ప్రోహిబిషన్& ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు మేరకు ఈ రెండు దుకాణాలకు డ్రా నిలిపివేసినట్లు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపారు.

Similar News

News October 27, 2025

జిల్లా పోలీస్ కార్యాలయానికి రావొద్దు: VZM SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టమ్‌’ (PGRS) రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం ప్రకటించారు. “మొంథా” తుఫాను ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదుదారులు ఎవ్వరూ రావద్దని, తుఫాను సమయంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు.

News October 27, 2025

శుభ సమయం (27-10-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల షష్ఠి తె.3.07 వరకు
✒ నక్షత్రం: మూల ఉ.10.27
✒ శుభ సమయాలు: సామాన్యము
✒ రాహుకాలం: ఉ.7.30-9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, వర్జ్యం: ఉ.8.43-10.28, రా.8.46-10.30, ✒ అమృత ఘడియలు: లేవు
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాలు కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.

News October 27, 2025

అన్నమయ్య: ఈ రెండు రోజులు జాగ్రత్త

image

అన్నమయ్య జిల్లాకు ఇవాళ్టి నుంచి తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు. అలాగే ఏవైనా సహాయ చర్యలు కావాల్సి ఉంటే 112 లేదా రాయచోటి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08561-293006 ఫోన్ చేయాలని ఎస్పీ ధీరజ్ సూచించారు. అలాగే వాగులు, వంకలు, నదులు, చెరువుల దగ్గరకు వెళ్లవద్దన్నారు.
#SHARE IT