News March 20, 2025

చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికం..!

image

నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.3°C ఉష్ణోగ్రత నమోదవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్చిలోనే 42.3°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

Similar News

News December 13, 2025

MLAల చేతుల్లో MRO ఆఫీసులు: ధర్మాన

image

AP: భూ సమస్యలు తీరక సామాన్యులు బాధపడుతున్నారని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ‘5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కొలతలు చేయగల టెక్నాలజీతో భూ సర్వే జరుపుతుంటే, సర్టిఫికెట్‌పై జగన్ బొమ్ముందని, భూములు ఆయన తీసుకుంటారని చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్క భూ సంస్కరణ అయినా తెచ్చారా? నేడు ఎమ్మార్వో కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి’ అని విమర్శించారు.

News December 13, 2025

బి.కొత్తకోట: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది వీరే.!

image

పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని శనివారం బి.కొత్తకోట బాలికల హైస్కూల్‌లో మండల స్థాయి వ్యాసరచన, వకృత్వ, క్విజ్ పోటీలు జరిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వ్యాసరచన పోటీల్లో మానస, వకృత్వ పోటీల్లో నవదీప్ రెడ్డి, క్విజ్ పోటీల్లో నవదీప్ రెడ్డి సత్తా చాటారని MEOలు రెడ్డిశేఖర్, భీమేశ్వరాచారి తెలిపారు. వీరు రాయచోటిలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొటారన్నారు.

News December 13, 2025

తొండూరులో 9 మంది విద్యార్థులకు అస్వస్థత

image

తొండూరు మండలంలోని యాదవారిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనం తిన్న 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరేచనాలు అవుతుండడంతో తొండూరు 108 వాహనంలో చికిత్స నిమిత్తం పులివెందుల హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.