News July 10, 2025

చాగల్లు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

చాగల్లుకు చెందిన (59) శ్రీరంగం కృష్ణారావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బుధవారం తెల్లవారుజామున రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం రాత్రి చాగల్లులో కృష్ణారావు మోపెడ్ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఏఎస్ఐ వి.శ్రీనివాసరావు తెలిపారు.

Similar News

News September 1, 2025

తూర్పు గోదావరి: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

image

తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ 1న పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పీ.ప్రశాంతి ఆదివారం తెలిపారు. మొత్తం 2,35,813 మందికి రూ.102.80 కోట్లు అందజేయనున్నామని వెల్లడించారు. ఇందులో 33,177 మంది వికలాంగులకు కూడా పంపిణీ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.

News August 31, 2025

దివ్యాంగులకు యథావిధిగా పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

image

సెప్టెంబర్ 1న జిల్లాలోని దివ్యాంగులకు పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,35,813 మందికి రూ.102.80 కోట్ల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆమె ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని 33,117 దివ్యాంగుల పెన్షన్లలో కేవలం 33 మంది మినహా మిగిలిన వారందరికీ పెన్షన్లు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News August 31, 2025

ఇకపై డిజిటల్ విధానంలో చెల్లింపులు: కలెక్టర్

image

ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు సులభతరంగా పన్నులు చెల్లించేందుకు స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్ ను ప్రవేశపెట్టినట్టు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. అసెస్‌మెంట్ ఆధారంగా ప్రజలు ఇంటి పన్నులు డిజిటల్ రూపంలోనే చెల్లించవలసి ఉంటుందన్నారు. ఇకపై డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ చెల్లింపులు నేరుగా గ్రామ పంచాయితీ ట్రెజరీ ఖాతాలోనే జమ అవుతాయన్నారు.