News September 6, 2024
చాగల్లు రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

పెద్దపప్పూరు మండలంలో అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం పర్యటించారు. మండల పరిధిలోని చాగల్లులో పెన్నానదిపై నిర్మించిన చాగల్లు రిజర్వాయర్‌ను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. రిజర్వాయర్ సామర్థ్యం, ఇన్ ఫ్లో ఎంత ఉందన్న వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 29, 2025
జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పూల నాగరాజు

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పూల నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉదయం అధ్యక్షుడిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరిలు బాధ్యతలు స్వీకరించారు. వారిని ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News December 28, 2025
రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఛైర్మన్‌గా ఆదెన్న

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఛైర్మన్‌గా రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రభుత్వం ఆదెన్న పేరును సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు పంపారు. శనివారం రాత్రి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. సుమారు 20 ఏళ్లపాటు TDP లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఆదెన్న పనిచేశారు. అనంతపురంలో స్థిరపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
News December 28, 2025
అనంత: భారీగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గుత్తి పట్టణంలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260. అనంతపురంలో రూ.220, స్కిన్ లెస్ రూ.260. గుంతకల్లులో రూ.220, స్కిన్లెస్ రూ.240గా విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ రూ.750లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒక్కసారి ఇలా చికెన్ ధరలు పెరగడంతో మాంసం ప్రియులు అయోమయంలో పడ్డారు.


