News June 2, 2024

చాణక్య ఎక్స్.. ఉమ్మడి తూ.గో.లో కూటమివైపే ప్రజలు!

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో 10 టీడీపీ, వైసీపీ ఒక చోట విజయం సాధిస్తుందని చాణక్య ఎక్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. కాగా.. తుని, అనపర్తి, రాజానగరంలో YCPకి, కాకినాడ రూరల్, పి.గన్నవరంలో జనసేనకు, రామచంద్రపురంలో TDPకి ఎడ్జ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఇక కాకినాడ సిటిలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుందని చెప్పింది.

Similar News

News February 11, 2026

రాజమండ్రి: వికసిత భారత్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పురందేశ్వరి

image

‘వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు- 2025’ సంయుక్త కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. 2047 నాటికి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ, వికసిత భారత్ లక్ష్య సాధన కోసం కమిటీ సభ్యులతో కలిసి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

News February 11, 2026

రాజమండ్రి: తిట్టిన వారికి సెంట్రల్ జైలా?

image

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, కురసాల కన్నబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ.. “కొట్టిన వారికి స్టేషన్ బెయిలు, తిట్టిన వారికి సెంట్రల్ జైలు” అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందిస్తూ.. తప్పు జరిగినట్లు తేలితే ‘దైవ ద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

News February 11, 2026

పట్టిసీమ: వీరభద్రేశ్వరుడుని దర్శించుకున్న ప్రముఖ సినీ రచయిత

image

ప్రసిద్ధ శైవక్షేత్రమైన పట్టిసీమ శ్రీ వీరభద్రేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త వీరభద్రరావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజానగరం ఇన్‌ఛార్జి వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.