News March 6, 2025

చాపాడు: భార్యను గొడ్డలితో నరికిన భర్త

image

చాపాడు మండలం నక్కలదిన్నె సమీపంలో గురువారం మధ్యాహ్నం భార్య‌ను భర్త యెర్రిబోయిన భాస్కర్ గొడ్డలితో నరికాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతకానికి పాల్పడినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ, ఎస్సై చిన్న పెద్దయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 12, 2025

రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు చాపాడు విద్యార్థి

image

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు చాపాడు హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి టి. చంద్రశేఖర్ ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు పి. వెంకటలక్ష్మి తెలిపారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో చంద్రశేఖర్ 58 కేజీల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి ఉత్తమ ప్రతిభ చూపడం పట్ల ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, పీడీ ఓబయ, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

News September 11, 2025

చాపాడు: మాల్కంబీ రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

image

మాల్కంబీ రాష్ట్ర స్థాయి పోటీలకు చాపాడు మండల నరహరిపురం పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు నరసింహ శాస్త్రి తెలిపారు. మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమిలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఎస్‌జీ‌ఎఫ్ఐ (మాల్కంబీ) క్రీడలలో జిల్లా స్థాయి పోటీల నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు అండర్ 17 విభాగంలో వి. సుబ్బలక్ష్మి (10వ తరగతి), కె. మస్తాన్ వల్లి (9వ తరగతి) ఎంపిక అయ్యారని తెలిపారు.

News September 11, 2025

ఎర్రగుడిపాడులో రైలులో నుంచి పడి యువకుడి మృతి

image

ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.