News February 10, 2026
చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే..

చామంతి సాగులో కొన్ని సార్లు పువ్వుల పరిమాణం మరీ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రైతులకు ఆశించిన ధర రాదు. చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే.. మొక్కల తలల కత్తిరింపు చేపట్టిన తర్వాత 20 నుంచి 25 రోజులకు లీటరు నీటిలో 50 ppm జిబ్బరెల్లిక్ ఆమ్లం (50 మిల్లీ గ్రాములను) కలిపి పిచికారీ చేయాలని హార్టికల్చర్ నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News February 22, 2026
T20 WC: SAతో మ్యాచుకు భారత జట్టు ఇదేనా?

సూపర్-8లో ఇవాళ SAతో మ్యాచులో IND ప్లేయింగ్-11 ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. అభిషేక్‌ను తొలగిస్తారని, తిలక్ స్థానంలో శాంసన్ ఆడిస్తారన్న వార్తలను కెప్టెన్ సూర్య ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొట్టిపారేశారు. దీంతో వారిద్దరూ ఆడతారని కన్ఫర్మ్ అయింది. సుందర్ స్థానంలో అక్షర్ టీమ్‌లోకి రావొచ్చు.
ప్లేయింగ్11(అంచనా): సూర్య, అభిషేక్, ఇషాన్, తిలక్, హార్దిక్, అక్షర్, దూబే, రింకు, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్.
News February 22, 2026
పత్తిలో గులాబీ రంగు కట్టడికి ముందస్తు జాగ్రత్తలు

ఎండాకాలంలో లోతు దుక్కులను చేసుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు. పత్తి తీతకు ఉపయోగించిన పనిముట్లను రసాయనాలతో శుభ్రం చేసి ఉంచాలి. ఒక ప్రాంతంలో పత్తిని దఫదఫాలుగా కాకుండా ఒకేసారి నాటడం వల్ల పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు. అలాగే వేసవిలో పత్తిని నాటకూడదు. గులాబీ పురుగు ఉద్ధృతి ఉన్నచోట నుంచి పత్తిని లేదా కాటన్ విత్తనాలను తీసుకురాకూడదు, నాటకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
News February 22, 2026
ధన్వంతరి మంత్రం ఎందుకు పఠించాలి?

ధన్వంతరిని ఆరోగ్య ప్రదాతగా కొలుస్తారు. ఆయుర్వేద అధిదేవత, దేవవైద్యుడు కూడా ఆయనే. అయితే ఆయన పేరుమీద ఉన్న ధన్వంతరీ మంత్రాన్ని పఠిస్తే అనారోగ్యాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారికి భవిష్యత్తులో రోగాలు వ్యాపించకుండా కాపాడుతుందని అంటున్నారు.
మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ! ధన్వంతరయే అమృత కలశ హస్తాయ| సర్వమయ వినాశాయ త్రైలోక్య నాథాయ| ధన్వంతరి మహావిష్ణవే నమః|


