News June 4, 2024

చారిత్రక విజయం దిశగా శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చారిత్రక విజయాన్ని అందుకునే దిశగా టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ కదులుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో శ్రీభరత్ 6,76,463 ఓట్లు సాధించారు. దీంతో ఆయన ఆధిక్యత 3,74,090 ఓట్లకు చేరింది. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికీ కేవలం 3,02,373 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 23 వేల ఓట్లు వచ్చాయి.

Similar News

News September 19, 2025

విశాఖలో వెహికల్ రిటర్న్ మేళా

image

విశాఖ నగరంలో వివిధ కారణాలవల్ల స్వాధీనం చేసుకున్న వాహనాలను సీపీ వాహనదారులకు తిరిగి అందజేశారు. పోలీస్ గ్రౌండ్‌లో శుక్రవారం సీపీ శంఖబ్రత బాగ్చి 346 వాహనాలను వాహనదారులకు అందజేశారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లు సీపీ తెలిపారు. ఇప్పటివరకు మూడు వెహికల్ రిటర్న్ మేళా నిర్వహించి 818 మందికి వారి వాహనాలు అందించినట్లు వెల్లడించారు.

News September 19, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఢిల్లీ అధికారులు

image

ఢిల్లీ నుంచి స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రెటరీలు విశాఖ చేరుకున్నారు. వారు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నేడు సందర్శించనున్నారు. ఉత్పత్తి తగ్గుదల, బొగ్గు సమస్యపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఎంపిక చేసిన అధికార ఉద్యోగ బృందాలతో సమావేశమౌతారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి సమీక్షల్లో భాగంగా వస్తున్నట్లు సమాచారం.

News September 19, 2025

విశాఖ: గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు

image

వన్ టౌన్‌లో నివాసం ఉంటున్న నవీన్ కుమార్ దంపతులను గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ జీడి బాబు తెలిపారు. బాధితులకు గోల్డ్ ఇస్తామని రూ.3 కోట్లు తీసుకొని ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. నిందితులు దామోదర నాయుడు, ఉమామహేశ్వరరావు, దిలీప్‌లను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.