News January 19, 2026
చార్‌ధామ్ యాత్ర.. టెంపుల్స్‌లోకి మొబైల్స్ బంద్

చార్‌ధామ్ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లోకి మొబైల్స్, కెమెరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. వీటి వినియోగంతో దర్శన సమయంపై ప్రభావం పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మొబైల్స్, కెమెరాలు సేఫ్‌గా ఉంచడానికి టెంపుల్స్ వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Similar News
News February 5, 2026
గుండెపోటు రావొద్దంటే ఇవి తినాల్సిందే!

ధమనుల లోపలి గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో అవి బ్లాక్ అయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఓట్స్, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. టమాటాల్లోని విటమిన్ C, E, ఫ్లేవనాయిడ్స్ వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. క్యాబేజీ, బ్రోకలీ, కాలిఫ్లవరూ ఎంతగానో దోహదపడతాయి. చేపలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
News February 5, 2026
ఏప్రిల్-మేలో SIR నోటిఫికేషన్: CEO

TG: రాష్ట్రంలో ఏప్రిల్-మే నెలల్లో SIR నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఇవాళ ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఒక బూత్ లెవెల్ ఏజెంట్(BLA)ను నియమించుకోవాలని పార్టీలకు సూచించారు. 2025 జాబితాలో ఉన్న ఓటర్లను 2002 SIRలో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్ టాప్ మ్యాపింగ్ చేపట్టామని తెలిపారు.
News February 5, 2026
వెస్ట్ బైపాస్ నుంచే వెళ్లండి.. జగన్‌కు నోటీసులు

AP: రేపు వైసీపీ అధినేత జగన్ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఈ పర్యటనపై పోలీసులు తాజాగా జగన్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెస్ట్ బైపాస్ రోడ్డులో వెళ్లాలని పేర్కొన్నారు. ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా బుధవారం జగన్ గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.


