News April 10, 2024
చార్మినార్ వద్ద ఇదీ పరిస్థితి!

రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్‌బజార్‌కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో పాషింగ్ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
PIC CRD: Anjum Alam
Similar News
News October 28, 2025
HYD: రోగికి సేవల పేరిట మహిళను ఏపీకి తరలింపు!

రోగికి సేవచేయడానికెళ్లిన మహిళ తిరిగిరాని ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. హనుమాన్‌నగర్ గార్డెన్-IIలో బంకా హేమేశ్వరి(45) ఉంటుంది. OCT 25న ఉద్యోగానికెళ్తున్నట్లు కూతరు జయశ్రీ(22)కి తెలిపింది. సా.7:30కి తల్లి ఫోన్ కలవలేదు. 26న ఉ.9కి ఫోన్ చేస్తే రోగి కుటుంబం విజయవాడకు తీసుకెళ్లిందని చెప్పింది. రా.11కు మరోకూతురు తేజస్వికి వీడియో కాల్‌లో రోగిని చూపిస్తూ ఏడుస్తూ కాల్ కట్ చేసిందని PSలో ఫిర్యాదు చేసింది.
News October 28, 2025
జూబ్లీ ఎన్నికల్లో 569 కంట్రోల్ యూనిట్లు

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే 4 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసి వాటిని సిరీస్ శ్రేణిలో ఏర్పాటు చేసి కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ మిషన్‌ను అనుసంధానిస్తారు. మొత్తం కంట్రోల్ యూనిట్లు 569, బ్యాలెట్ యూనిట్లు 2,442, వీవీ ప్యాట్లు 610 ఉపయోగించనున్నారు.
News October 28, 2025
హరీశ్‌రావు తండ్రి మరణం బాధాకరం: ‘X’లో సీఎం

మాజీ మంత్రి, సిద్ధిపేట MLA హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి Xలో వేదికగా పోస్ట్ చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్‌రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని రాసుకొచ్చారు.


