News July 1, 2024

చింతకొమ్మదిన్నె: పెళ్లికి తీసుకెళ్లలేదని ఆత్మహత్య

image

మండలంలోని అంగడివీధికి చెందిన ఓ బాలిక (16) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పెద్దముడియం మండలానికి చెందిన బాలిక అంగడివీధిలోని తన పిన్ని ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. కుటుంబ సభ్యులు తనని పెళ్లికి తీసుకువెళ్లలేదని మనస్తాపంతో అధిక మోతాదులో మాత్రలు మింగి అస్వస్థకు గురి కావడంతో, ఏలూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

Similar News

News July 3, 2024

ఖాజీపేట హై‌స్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సస్పెండ్

image

ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్‌ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.

News July 3, 2024

కడప: ఎమ్మెస్సీకి దరఖాస్తుల స్వీకరణ

image

కడప: వైవీయూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు శాఖాధిపతి ఆచార్య తుమ్మలకుంట శివప్రతాప్ తెలిపారు. ఈ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. సందేహాలకు ఎం.శశికుమార్
(898559792)ను సంప్రదించాలన్నారు.

News July 2, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.రామచంద్రయ్య నామినేషన్

image

ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో ఆయన రాష్ట్ర మంత్రులతో కలిసి తన నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆయనపై వైసీపీ నేతలు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శాసనమండలి ఛైర్మన్ ఆయనను అనర్హుడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన ఆ స్థానానికి నామినేషన్ వేశారు.