News September 12, 2025

చింతపల్లి: అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు 15న స్పాట్ కౌన్సెలింగ్

image

ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 15న స్పాట్ కౌన్సెలింగ్ జరగనుందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న, చేయించుకోని విద్యార్థులు సైతం గుంటూరు లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చన్నారు.

Similar News

News April 13, 2026

అనకాపల్లి: ప్రేమ పేరుతో మోసం.. CISF కానిస్టేబుల్ అరెస్ట్

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో CISF కానిస్టేబుల్ కె.రాజీవ్ గాంధీని అరెస్ట్ చేసినట్లు అనకాపల్లి సీఐ ప్రేమ్ కుమార్ ఆదివారం తెలిపారు. చీడికాడ మండలానికి చెందిన కానిస్టేబుల్ చోడవరం మండలానికి చెందిన యువతిని అనకాపల్లిలో తన అక్క ఇంటిలో ఉంచి ఆమెను కలిసేవాడు. పెళ్లి విషయం ప్రస్తావించగా నిరాకరించడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు యూపీలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశామన్నారు.

News April 13, 2026

మచిలీపట్నం-విజయవాడ హైవేపై ప్రమాదం.. స్పాట్ డెడ్, కారు నుజ్జు

image

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ఉయ్యూరు వద్ద ఉన్న జియో పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. కానూరుకు చెందిన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో ప్రయాణికుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News April 13, 2026

HYD: నేడు ఈ రూట్లో NO ENTRY

image

ఉప్పల్‌లో నేడు జరిగే IPL మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉప్పల్ రింగ్ రోడ్డులో భారీ వాహనాలకు నో ఎంట్రీ. లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లు, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC వాహనాలు, JCBలు, ఐచర్ వ్యాన్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్ల రాకపోకలు నిషేధించారు. డైవర్షన్ మార్గాలు వినియోగించాలని పోలీసులు సూచించారు.