News March 25, 2025

చింతపల్లి ఆస్పత్రిలో సందర్శించిన జిల్లా వైద్య అధికారి

image

దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి ఉంటే ఆసుపత్రికి వెళ్లి ఉమ్మి పరీక్ష చేయించుకుని అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు అధికారి టి ఎన్ ప్రతాప్ స్థానిక గిరిజనులకు సూచించారు. సోమవారం చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన సందర్శించి నెలకు ఎన్ని టీబీ కేసులు నమోదవుతున్నాయో అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Similar News

News July 9, 2025

కర్నూలు మాజీ ఎంపీకి గోల్డ్ మెడల్

image

కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ బుధవారం విజయవాడలో అందజేశారు. 17వ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలకు గాను ఈ మెడల్ అందజేసి, సన్మానించారు. గవర్నర్‌తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

News July 9, 2025

KNR: లోకల్ ఎన్నికలు.. ఆ పార్టీలు తగ్గేదేలే..!

image

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు. కాగా నిన్న కాంగ్రెస్ ఉమ్మడి KNR జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అద్దంకి దయాకర్‌ను అధిష్ఠానం నియమించగా పార్టీ బలోపేతంపై ఆయన ఫోకస్ చేయనున్నారు. మరోవైపు KTR ఆదేశాలతో ఇప్పటికే BRS నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. BJP సైతం గట్టి పోటీనిచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది.

News July 9, 2025

మూడో టెస్టుకు టీమ్ ప్రకటన.. స్టార్ పేసర్ రీఎంట్రీ

image

భారత్‌‌తో రేపటి నుంచి జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ ప్లేస్‌లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ENG బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. లార్డ్స్‌లో గ్రీన్ పిచ్‌ ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్చర్ కీలకంగా మారనున్నారు.
ENG: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్