News July 10, 2025

చింతపల్లి ఎస్సైపై హైకోర్టు ఆగ్రహం

image

నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్సై రామ్మూర్తిపై హైకోర్టు ఆగ్రహం చేసింది. టీవీ యాంకర్‌ శిల్పా చక్రవర్తి దంపతులకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చిన ఎస్సై వారిని స్టేషన్‌కు పిలిపించారు. ఈ వ్యవహారాన్ని బలవంతంగా సెటిల్‌ చేసేందుకు యత్నించారని శిల్పా చక్రవర్తి దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఎస్సైకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Similar News

News July 10, 2025

ఢిల్లీ వెళ్లిన అనకాపల్లి కలెక్టర్

image

జల్ జీవన్ మిషన్‌పై ఢిల్లీలో నేడు జాతీయ సదస్సు జరిగింది. రాష్ట్ర ప్రతినిధిగా అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోఈ పథకం కింద ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనిని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి సదస్సు జరగనుంది. ఇందులో కలెక్టర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

News July 10, 2025

ఇద్దరు భార్యలు, 45 ఏళ్ల వయసు అయినా..

image

అఫ్గానిస్థాన్‌లో 2021లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి బాల్య, బలవంతపు వివాహాలు 25 శాతం పెరిగాయని UNO తెలిపింది. తాజాగా హెల్మాండ్ ప్రావిన్స్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల పాపను పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. అతడికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని, డబ్బులు ఇచ్చి ఆ పాపను కొనుగోలు చేశాడని అఫ్గాన్ మీడియా తెలిపింది. ఈ విషయం అధికారులకు తెలియడంతో చిన్నారి తండ్రి, పెళ్లి కొడుకును అరెస్టు చేశారు.

News July 10, 2025

PDPL: జిల్లాలో బోడ కాకరకాయ కిలో ₹ 240

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూరగాయల మార్కెట్‌లలో బోడ కాకరకాయ ధర కిలో ₹ 240కి చేరింది. ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలు అందించే బోడ కాకరకాయ అంటే అందరికీ ఇష్టమే. ఈ సీజన్ ప్రారంభంలోనే కిలో ₹ 200 పైన ధర పలకడంతో వినియోగదారులు వామ్మో అంటున్నారు. కిలో చికెన్ ధరకు సరి సమానంగా మారింది. ధర ఎక్కువే అయినప్పటికీ బోడ కాకరకాయ కొనుక్కునేందుకు ప్రజలు మక్కువ కనబరుస్తున్నారు.