News July 7, 2025
చింతపల్లి: పాఠశాల పైకప్పుపై టార్పాలిన్ కవర్లు

చింతపల్లి మండలం చౌడురాయిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. వర్షాలు కురిసినప్పుడు తరగతి గదులు, వరండాల్లో వాన నీటితో నిండిపోతుంది. ఇలా నీటిలోనే విద్యార్థులు విద్యను అభ్యసించడంతో తల్లిదండ్రులు పైకప్పుపై టార్పాలిన్ కవర్లను వేసి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. సుమారు 30 ఏళ్ల క్రితం పాఠశాల భవనం నిర్మించారని, మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
Similar News
News July 7, 2025
WGL: క్వింటా పత్తి ధర రూ.7,550

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభమైంది. అయితే మార్కెట్‌కు పత్తి అంతంత మాత్రంగానే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ధర మాత్రం భారీగానే పలికినట్లు చెప్పారు. గతవారం గరిష్ఠంగా క్వింటా పత్తి ధర రూ.7,565 నమోదవగా.. నేడు రూ.7,550కి చేరింది. ప్రస్తుతం పత్తి అందుబాటులో లేని సమయంలో ఇంత ధర పలకడం రైతులకు కొంత నిరాశ కలిగించే విషయం.
News July 7, 2025
HYD: కాలుకు సర్జరీ.. గుండెపోటుతో బాలుడి మృతి

కాలుకు సర్జరీ చేసిన అనంతరం గుండెపోటు రావడంతో 7 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన HYDలో వెలుగుచూసింది. కాలులో చీమును తొలగించేందుకు బాలుడిని తల్లిదండ్రులు బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లోని టీఎక్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో గుండెపోటు రావడంతో బాలుడు మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమారుడి ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
News July 7, 2025
GNT: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీ.ఏ, బీ.కామ్, బీ.బీ.ఏ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 30-ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుపుతామని, పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని కోరింది.