News January 11, 2025

చింతలపూడి తహశీల్దార్‌కు ఏలూరు జిల్లాలో సెకండ్ ర్యాంకు

image

విధి నిర్వహణ, పనితీరు ఆధారంగా చింతలపూడి మండల తహశ్దీలార్ డి. ప్రమద్వార ఏలూరు జిల్లాలో ద్వితీయ ర్యాంకు సాధించారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు ప్రమద్వారను అభినందించారు. జిల్లాలో పనితీరు ఆధారంగా ద్వితీయ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని ఈ విజయం సాధించడానికి సహకరించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఉన్నతాధికారులు, చింతలపూడి మండల రెవెన్యూ సిబ్బందికి కృతజ్ఞతలన్నారు.

Similar News

News April 22, 2025

ఇబ్బందులు ఉంటే రైతులు తెలపాలి: జేసీ

image

ఉండి మండలం యండగండి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతు సేవ కేంద్రం ద్వారా కొనుగోలు సక్రమంగా జరుగుతుందా, అధికారులు మీకు సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలపాలన్నారు. రైతులతో కలిసి తేమ శాతం పరిశీలించారు.

News April 22, 2025

భీమవరం లాడ్జిలో పోలీసుల తనిఖీలు

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ రెసిడెన్షియల్ & లాడ్జిపై టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9మంది అమ్మాయిలు, 9మంది అబ్బాయిలు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకుడు అంతం శ్రీను పరారైనట్లు స్థానికులు తెలిపారు.

News April 22, 2025

ప.గో: అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి- జేసి

image

రీ ఓపెన్ అయినా అర్జీల విషయంలో మరింత జవాబుదారితనం కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారం తీసుకున్న చర్యలు, రీ ఓపెన్ అయిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లోని సమస్యలపై చర్యలు చేపట్టి పరిష్కరించాలన్నారు.

error: Content is protected !!