News September 6, 2025
చింతలపూడి: రూ.48 లక్షలతో గణేశుడి అలంకరణ

చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా రూ.48 లక్షల కరెన్సీ నోట్లతో వినాయక మండపాన్ని అలంకరించారు. శుక్రవారం కావడంతో లక్ష్మీ గణపతి రూపంలో రాత్రి స్వామి వారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణకు సహకరించిన గ్రామస్థులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు లక్ష్మీ అలంకరణలో ఉన్న వినాయకుడిని దర్శించుకున్నారు.
Similar News
News September 6, 2025
ADB: వినాయక నిమజ్జనం.. అందుబాటులో 108 సేవలు

ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పలుచోట్ల 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఇన్‌ఛార్జీ రాజశేఖర్, సామ్రాట్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, కిసాన్ చౌక్, చందా, పెన్‌గంగాతో పాటు ఉట్నూర్, బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్‌లో 108 సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని వారు పేర్కొన్నారు.
News September 6, 2025
PDPL: 9వ సారి లడ్డూ దక్కించుకున్న యువకుడు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గణేష్ నగర్‌లో నెలకొల్పిన మహాగణపతి లడ్డూను చింతపండు సాయి చరణ్, ప్రమోదిని దంపతులు వేలం ద్వారా రూ.75 వేలకు దక్కించుకున్నారు. అయితే ఆ లంబోదరుడి మహాప్రసాదాన్ని సాయి చరణ్ వరుసగా తొమ్మిదోసారి దక్కించుకోవడం విశేషం. ఇందుకు ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మండపంలోని ప్రధాన కలశాన్ని రూ.25వేలకు సిగిరి లచ్చయ్య దక్కించుకున్నారు.
News September 6, 2025
KMR: మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తులు

ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి NMMS స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు DEO రాజు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ ఈనెల 6 జనరల్, BC విద్యార్థులకు రుసుం రూ.100, SC, ST, దివ్యాంగులకు రూ.50 దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను హెడ్‌మాస్టర్‌కు సమర్పించాలని కోరారు.