News November 19, 2025

చింతూరు: ఆడుతూ స్పృహ తప్పి చిన్నారి మృతి

image

చింతూరు మండలం కుయుగూరులో చిన్నారి శ్యామల జనని(5) బుధవారం ఆకస్మికంగా మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. బాలిక తోటి పిల్లలతో అంగన్వాడీ కేంద్రానికి వెళుతూ దారిలో ఉన్న రేగుపళ్లు తిని ఆడుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయిందని గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యుల చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్నారు.

Similar News

News November 19, 2025

72 గంటల పనివేళలు వారికోసమే: పాయ్

image

నారాయణ మూర్తి ప్రతిపాదించిన వారానికి 72 గంటల <<18309383>>సలహాను<<>> పారిశ్రామిక వేత్త మోహన్‌దాస్ పాయ్ గట్టిగా సమర్థించారు. అయితే ఈ సూచన సాధారణమైన ఉద్యోగులకు కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కఠిన నిబంధన కేవలం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకునే పారిశ్రామికవేత్తలు, వినూత్న ఆవిష్కర్తలకు మాత్రమే వర్తిస్తుందని పాయ్ అన్నారు. గ్లోబల్ పోటీని తట్టుకోవడానికి ఇన్నోవేటర్లు ఈ అంకితభావం చూపాలని ఆయన తెలిపారు.

News November 19, 2025

ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు: డీఈఓ సత్యనారాయణ

image

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నెలలో కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. నవంబర్ 21, 22న ప్రాథమిక పాఠశాల, 24, 25న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొనాలని ఆయన ఆదేశించారు. ఉపాధ్యాయులు రెండు రోజులు విడివిడిగా తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ స్పష్టం చేశారు.

News November 19, 2025

కుండలేశ్వర పుణ్యక్షేత్రంలో విషాదం

image

కాట్రేనికోన మండలం కుండలేశ్వరం శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి దర్శనానికి వచ్చిన బొట్టా నిర్మల (67) గుండెపోటుతో మృతిచెందారు. భక్తురాలు నిర్మల స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయం బయట కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.