News April 8, 2025
చింతూరు: ఈ నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ

ఈ నెల 10న చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పేజ్ 1bలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ఈ కార్యక్రమానికి వచ్చి అభిప్రాయాలు తెలపాలన్నారు. నిర్వాసితులు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు వెళ్లిన తర్వాత జీవనోపాధి, నైపుణ్య శిక్షణకు ఎటువంటి అవకాశాలు కావాలో తెలియజేయాలన్నారు.
Similar News
News April 17, 2025
గద్వాల: ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా

గద్వాల ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వివిధకంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్‌తో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 17, 2025
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.
News April 17, 2025
మంత్రి పొన్నం అపాయింట్‌మెంట్ కావాలా!

మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన్ను కాలవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘మంత్రి అపాయింట్ మెంట్ కావాలంటే 9959226407 నంబర్‌కు మెసేజ్ చేయాలని’ ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన మంచి ఫలితాలను ఇస్తుందని మంత్రి కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.