News November 19, 2025
చింతూరు: కాలువలో ఈతకు దిగి యువకుడి గల్లంతు

మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోర్ బై కెనాల్‌లో ఈతకు దిగిన ఓ యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి ఎలమంచిలిలోని నారాయణపురం గ్రామానికి చెందిన గనిశెట్టి జగదీశ్వరరావు (25)గా గుర్తించామని ఎస్సై సాధిక్ తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు స్నేహితులు కాలువలోకి దిగగా ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారని చెప్పారు.
Similar News
News November 22, 2025
HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
రేపు హనుమకొండలో హాఫ్ మారథాన్

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించబోయే హాఫ్ మారథాన్‌లో పాల్గొనే వారికి కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి పాసులను అందజేశారు. ఓరుగల్లు నగరంలో మొదటి సారి నిర్వహిస్తున్న హాఫ్ మారథాన్‌ను విజయవంతం చేయాలన్నారు. కాళోజీ కళాక్షేత్రం నుంచి మారథాన్ ప్రారంభమై ఫారెస్ట్ ఆఫీస్, ఫాతిమా జంక్షన్, వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ మీదుగా మళ్లీ కాళోజీ కళా క్షేత్రం వరకు మారథాన్ జరగనుంది.
News November 22, 2025
సింగూర్ ప్రాజెక్టు పరిశీలించనున్న అధ్యయన కమిటీ

సంగారెడ్డి జిల్లా వరప్రదాయని సింగూర్ డ్యాంను నేడు అధ్యయన కమిటీ పరిశీలించనున్నట్లు ఐబీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు మరమ్మతులపై సమాలోచనలు, మరమ్మతులకు డ్యాం ఖాళీ చేయాలా.. వద్దా.. అనే అంశంపై పరిశీలిస్తారు. డ్యామ్ ఖాళీ చేస్తే మూడు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయని జలమండలి అధికారులు అంటున్నారు. ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అధ్యయన కమిటీ నిర్ణయం తీసుకోనుంది.


