News June 24, 2024
చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన కలెక్టర్

నెల్లూరు నగరంలోని సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో గల జయభారత్ హాస్పిటల్ లో డయోరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న ఆరుగురు చిన్నారులను జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చిన్నారులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అన్ని పరీక్షలు కూడా బాగున్నాయని కలెక్టర్ కు వైద్యాధికారులు వివరించారు.
Similar News
News March 2, 2026
నెల్లూరులో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’

నెల్లూరు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పిల్లలపై లైంగిక నేరాల నిరోధం, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై శక్తి బృందాలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై నిఘా పెంచుతూ.. పిల్లల రక్షణ కోసం డయల్ 100, 1098 సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
News March 2, 2026
నెల్లూరు: నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు నర్సింగ్ హోమ్ కరస్పాండెంట్ ప్రభుదాసు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NEET-UG పరీక్షకు హాజరై ఉంటే సరిపోతుందన్నారు. మార్చి 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే తమ కాలేజీని సంప్రదించాలన్నారు.
News March 2, 2026
నెల్లూరు కిమ్స్‌కు 9మంది చిన్నారుల తరలింపు

నెల్లూరు జిల్లా ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పందించారు. 9మంది చిన్నారులను కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటించారు. ఆ ఏరియాలో ఎలాంటి కాంటామినేషన్ లేకుండా చర్యలు తీసుకువాలని ఆదేశించారు. తిరుపతి నుంచి ఫోరెన్సిక్ టీంను పిలిపించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.


