News March 9, 2025
చికిత్స పొందుతూ రాజన్నపేట యువకుడు మృతి

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకి చెందిన నమలికొండ నూతన్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. 2 నెలల క్రితం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట చేస్తూ కళ్ళు తిరిగి స్టవ్‌పై పడిపోవడంతో వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా సగభాగం శరీరం అంటుకుందని వైద్యులు తెలిపారు. హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
Similar News
News March 9, 2025
కొడంగల్: 10వ తరగతి విద్యార్థిని సూసైడ్

తండ్రి మందలించాడని మనస్తాపంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొడంగల్ మండలం మహంతిపూర్‌కు చెందిన లాలప్ప.. భార్య అనిత, కూతురు(15), కొడుకుతో కలిసి పొలం పనులకు వెళ్లారు. పొలం వద్ద కూతురు(15)ని లాలప్ప మందలించగా అలిగి ఇంటికెళ్లిన బాలిక ఉరేసుకుంది. గమనించిన సోదరుడు తండ్రికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
News March 9, 2025
ఏప్రిల్ 5 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

AP: ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట రామాలయం బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు CM చంద్రబాబు సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏప్రిల్ 11న స్వామి వారి కళ్యాణం సందర్భంగా సీఎం ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. భోజన వసతి, ప్రసాద వితరణ ప్రతి భక్తునికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News March 9, 2025
దుగ్గిరాల: వడదెబ్బకు గురై చిరువ్యాపారి మృతి

దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన చిరువ్యాపారి మృతిచెందాడు. పులివర్తి సురేశ్ (45) ద్విచక్ర వాహనంపై అరటిగెలలు పెట్టుకుని పరిసర గ్రామాల్లో ప్రజలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం దుగ్గిరాల వెళుతున్నానని చెప్పి వెళ్లిన సురేశ్ పోస్టాఫీస్ సమీపాన బస్ షెల్టర్‌లో మృతిచెంది ఉన్నాడు. పోలీసులకు అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు సురేశ్ మృతదేహాన్ని గుర్తించారు. వడదెబ్బకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు.