News February 25, 2025

చికెన్‌, గుడ్లు నిర్భ‌యంగా తినొచ్చు: VZM కలెక్టర్ 

image

ప్ర‌జ‌లు చికెన్‌, కోడిగుడ్ల‌ను నిర్భ‌యంగా తినొచ్చ‌ని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి, చికెన్‌, కోడిగుడ్ల వినియోగంపై త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో సోమ‌వారం సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి గానీ, ఆ ల‌క్ష‌ణాలు గ‌ల వ్యాధిగ్ర‌స్తులు గానీ లేర‌ని ప‌శు వైద్యాధికారులు దృవీక‌రించార‌ని చెప్పారు.

Similar News

News February 10, 2026

VZM: ‘ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి’

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల‌కు చేప‌ట్టిన భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వేగంగా పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. ప్రాజెక్టుల‌ భూసేక‌ర‌ణకు సంబంధించి క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. తార‌క‌రామ తీర్ధ‌సాగ‌ర్, తోటపల్లి ప్రాజెక్టులు, జాతీయ ర‌హ‌దారులు, తదితర ప్రాజెక్టులపై చర్చించారు.

News February 10, 2026

విజయనగరం జిల్లాలో 33 వేల ఎకరాల్లో మామిడి సాగు

image

విజయనగరం జిల్లాలో మామిడి పంట 33 వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యానవన శాఖాధికారి కే.చిట్టిబాబు తెలిపారు. వాతావరణం సానుకూలంగా ఉండడంతో మంచి ఫలితాలు వచ్చాయాన్నారు. మామిడికి వచ్చే తెగులు కూడా తక్కువుగా ఉండడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన విధంగా దిగుబడి ఉంటుందన్నారు. పొగమంచు పడడంతో మామిడి పూత రాలిపోకుండా పూత రాలిన చోట మందులు పిచికారి చేయాలని సూచించారు.

News February 10, 2026

VZM: ‘సాంకేతికతను ఉపయోగిస్తూ అప్రమత్తంగా ఉండాలి’

image

ప్రతి ఒక్కరూ ఆధునిక పరికరాలను ఇంటర్‌నెట్ అనుసంధానంతో విరివిగా ఉపయోగిస్తున్నారని, దీంతో సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అన్నారు. విజయనగరం కలెక్టరేట్‌లో NIC ఆధ్వర్యంలో సురక్షిత అంతర్జాల దినోత్సవం మంగళవారం జరిగింది. ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే మొబైల్ ఫోన్లు, డెస్క్ టాప్, ల్యాప్‌టాప్‌లకు 2 అంచల భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.