News March 8, 2025
చికెన్ టేస్ట్ చేసిన నెల్లూరు కలెక్టర్

నెల్లూరు వీఆర్సీ మైదానంలో చికెన్ & ఎగ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ చికెన్ మేళాను కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చికెన్‌ను నిర్భయంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మకండి అని ప్రజలకు సూచించారు. అలాగే జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చికెన్ టేస్ట్ చేశారు.
Similar News
News December 18, 2025
నెల్లూరు: 20న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్

పల్లెపాడు డైట్ కాలేజీలో ఈనెల 20న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డీఈవో ఆర్.బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 38 మండలాల నుంచి గ్రూప్ కేటగిరి, విద్యార్థి కేటగిరి, ఉపాధ్యాయ కేటగిరి ప్రాజెక్టులకు సంబంధించి 114 ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఇక్కడ గెలుపొందిన వారు ఈనెల 23, 24వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
News December 18, 2025
నెల్లూరు కలెక్టర్ బాగా పనిచేస్తున్నారు: CM

నెల్లూరు జిల్లాలో ‘ఛాంపియన్ రైతు’కు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలోనూ ఓ ఛాంపియన్ ఫార్మర్‌ను ఎంపిక చేసి మిగతా వారికి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. దీంతో కలెక్టర్‌ను CM చంద్రబాబు ప్రశంసించారు. ‘అమరావతిలోనే ఉండాలని హిమాన్షును కోరా. ఓ జిల్లాలో ఇంపాక్ట్ కలిగిస్తానని కలెక్టర్‌గా వెళ్లారు. చక్కగా పనిచేస్తున్నారు. ఇతర కలెక్టర్లు హిమాన్షును ఆదర్శంగా తీసుకోవాలి’ అని CM సూచించారు.
News December 18, 2025
టాప్-2లో నెల్లూరు జిల్లా..!

నెల్లూరు జిల్లాకు 2025-26 GDDP టార్గెట్ రూ.92,641కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.36,766కోట్లతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాకు 79/100 మార్కులొచ్చాయి. 2025-26లో రూ.2952కోట్ల పాల దిగుబడులతో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 97వేల ఇళ్లను మంజూరు చేయగా 68వేలు గ్రౌండింగ్ అయ్యాయి. 43వేల ఇళ్లను పూర్తి చేశామంటూ జిల్లా వివరాలను CMకు కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు.


