News February 26, 2025

చికెన్ లెగ్‌పీస్ తిన్న బాపట్ల జిల్లా కలెక్టర్

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా చికెన్ తినేందుకు ప్రజలు ఇప్పటికీ జంకుతున్నారు. చికెన్‌పై అపోహలు వద్దని చికెన్ తినొచ్చని అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో ఒకింత భయం నెలకొంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకేసి ప్రజల భయం పోగొట్టేలా చికెన్‌తో తయారు చేసిన ఆహారం తింటూ కనిపించారు. దీంతో ఇకనైనా ప్రజలు భయాన్ని వీడి చికెన్ తినాలని ఆకాంక్షించారు.

Similar News

News February 26, 2025

పిట్లం: కన్న తల్లిని చంపేశారు.. కారణమేంటో..?

image

నవమాసాలు మోసింది. పెంచి పెద్ద చేసింది. బిడ్డ కడుపు నిండితే తను సంతోషించింది. వృద్ధాప్యంలో తోడుగా నిలవాల్సిన తనయులె ఆ తల్లి పాలిట యముడయ్యారు. రోకలిబండతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లంలో మంగళవారం వెలుగు చూసింది. తల్లి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలే కారణంగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఎందుకు హత మార్చారో కారణాలు తెలియాల్సి ఉంది.

News February 26, 2025

చరిత్రలో ఈరోజు.. ఫిబ్రవరి 26

image

* 1802- ఫ్రెంచి నవలా రచయిత విక్టర్ హ్యూగో జననం
* 1829- బ్లూ జీన్స్‌ని తొలిసారి రూపొందించిన లెవీ స్ట్రాస్ అండ్ కో ఫౌండర్ లెవీ స్ట్రాస్ జననం
* 1932- సామాజిక కార్యకర్త హేమలతా లవణం జననం
* 1982- మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు పుట్టినరోజు
* 1962- ఉమ్మడి ఏపీ శాసనసభ మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు మరణం
* 1966- అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్ మరణం(ఫొటోలో)

News February 26, 2025

సంగారెడ్డి:ఈనెల 28 నుంచి నూతన ఉపాధ్యాయులకు శిక్షణ

image

సంగారెడ్డి జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా నూతనంగా విధులలో చేరిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఈనెల 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు విద్యాబోధన అంశాలపైన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్, బీసీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

error: Content is protected !!