News September 11, 2025

చిక్కడపల్లిలో BRSV ఆందోళన

image

చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేశారు. BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనియాస్ యాదవ్ ఆధ్వర్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరశన కార్యక్రమం నిర్వహించారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవుకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల గ్రూప్-1 పరీక్షలను రివాల్యుయేషన్ చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేశారు.

Similar News

News September 11, 2025

జగిత్యాల: ‘గర్భిణులు పరీక్షలు చేయించుకోవాలి’

image

జగిత్యాల జిల్లా ఉపవైద్యాధికారి ఎన్.శ్రీనివాస్ ఈరోజు మోతెవాడ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులు సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సికిల్ సెల్ వ్యాధితో హిమోగ్లోబిన్, ఆక్సిజన్ తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాధి తొలి దశలోనే గుర్తించేందుకు గర్భిణులు 12 వారాల్లోపు పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

News September 11, 2025

HYD: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోల్ ఫ్రీ నంబర్

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం HYDలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను, హెల్ప్ డెస్క్‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఫోన్ నం.1800 599 5991ను ఆవిష్కరించారు. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉ. 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వరకు పనిచేస్తుంద‌న్నారు.

News September 11, 2025

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బదిలీ

image

సాధారణ బదిలీల్లో భాగంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కీర్తి చేకూరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీర్తి చేకూరి స్వస్థలం వైజాగ్, ఆమె ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్ చేశారు. గతంలో గుంటూరు నగర కమిషనర్‌గా, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా పనిచేశారు.