News March 3, 2025
చిగురుమామిడి: హైనా దాడిలో లేగదూడ మృతి

కొండాపూర్ గ్రామానికి చెందిన చీకుట్ల రాజు అనే రైతు లేగ దూడపై హైనా దాడి చేసింది. రోజులాగే తన వ్యవసాయ పొలం వద్ద లేగదూడను కట్టివేసి ఇంటికి వెళ్ళానని, తిరిగి వచ్చేసరికి లేగ దూడ చనిపోయియిందన్నాడు. హైనా చంపిన ఆనవాళ్లను గుర్తించామని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతుకోరాడు. రైతులు తమ పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, కంచె ఏర్పాటు చేసుకోవాలని ఫారెస్ట్ అధికారి శేఖర్ రైతులకు తెలిపారు.
Similar News
News March 3, 2025
KNR: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.1983లో ఆయన శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.
News March 3, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో బురుగుపల్లి, కొత్తపల్లి-ధర్మారం 38.6°C, జమ్మికుంట 38.5, కరీంనగర్ 38.0, ఇందుర్తి, తాంగుల 37.6, ఖాసీంపేట, వీణవంక 37.4, మల్యాల 36.9, ఈదులగట్టేపల్లి 36.8, అర్నకొండ 36.6, నుస్తులాపూర్ 36.5, గుండి 36.3, గంగాధర 36.2, గంగిపల్లి, పోచంపల్లి, చింతకుంట 36.1, బోర్నపల్లి 36.0, ఆసిఫ్ నగర్, దుర్శేడ్ 35.8, గట్టుదుద్దెనపల్లె 35.4°C గా నమోదైంది.
News March 3, 2025
పెద్దపల్లి: పోలీస్ స్టేషన్‌ను పేల్చి 29 ఏళ్లు

PDPL జిల్లా ఓదెల(M) పొత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చిన ఘటనకు నేటితో 29ఏళ్లు. 1996 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది. దాడిలో కానిస్టేబుల్ షేక్ దాదా మరణించగా.. అప్పటి SI శ్రీధర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని నక్సల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 2003లో అప్పటి SP RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త స్టేషన్‌ను నిర్మించి హోంమంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.