News December 15, 2024
చిట్యాలలో వ్యక్తి మృతదేహం లభ్యం

చిట్యాల రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో మృతి చెంది ఉన్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుని వద్ద ఉద్యోగ గుర్తింపు కార్డు లభించింది. మృతుడు ఆర్ఎస్వీ ప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 14, 2026
నల్గొండ: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

చిట్యాల మండలం నేరడ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. హైదరాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్‌లో ఈ ఘటన జరగ్గా పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇదే మండలంలోని ఏపూరులో విధులు నిర్వహించారు. ఈ సెప్టెంబర్‌లో రిటైర్డ్ కావలసి ఉంది. ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పీఎస్‌లు సానుభూతిని తెలిపారు.
News February 14, 2026
NLG: సేవలో ఆ ఇద్దరు ఉపాధ్యాయులు ఆదర్శం!

ఈ గురువులు.. చదువు చెప్పడానికే పరిమితం కాలేదు. విద్యార్థుల భవిష్యత్తుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. కట్టంగూర్ (M) మల్లారం ప్రాథమిక పాఠశాల HM సమ్మెటి తిరుమలేష్, ఉపాధ్యాయుడు షరీఫ్ తమ సేవాభావంతో స్థానికుల మెప్పు పొందుతున్నారు. కట్టంగూర్ శివారులోని పేలాల పరిశ్రమలో పని చేస్తున్న వలస కార్మికుల పిల్లలను ప్రతి రోజు ఉదయం ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకెళ్ళి సాయంత్రం మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు.
News February 14, 2026
NLG: మున్సిపల్ ఎన్నికల్లో వాడిపోయిన కమలం

ఉమ్మడి NLG జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కార్యకర్తలు ఆశించిన విజయం దక్కించుకోలేకపోయారు. యాదాద్రి జిల్లాలో 12 వార్డుల్లో BNG 4, CPL 3, గుట్ట 2, ఆలేరు 2, పోచంపల్లి 1, MLG, DVKలో ఒక్కో వార్డు మాత్రమే, SRPTలో కేవలం 1 సీటు మాత్రమే దక్కించుకున్నారు. మొత్తంగా జిల్లాల వారీగా 15 వార్డులు, NLG కార్పొరేషన్లో 4 డివిజన్లో మాత్రమే దక్కాయి.


