News November 1, 2025
చిట్యాల: అత్తగారిళ్లకు చేరినా.. చెరగని స్నేహం..!

బాల్య స్నేహితురాళ్లు పెళ్లై బాధ్యతలు పెరిగాక బాల్య మిత్రులను మర్చిపోతుంటారు. అత్తగారింటి ఆంక్షలు, కుటుంబ బాధల్లో చిక్కుకొని పలకరింపులే కరువైన రోజులివి. కాగా, ఓ బాల్య స్నేహితురాలు ఆపదలో ఉందని తెలుసుకొని ఆసరాగా నిలిచారు చిన్ననాటి స్నేహితురాళ్లు. భూపాలపల్లికి చెందిన నర్మద అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని చిట్యాల జడ్పీహెచ్ఎస్ 2006 టెన్త్ బ్యాచ్ మిత్రురాళ్లు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు.
Similar News
News November 1, 2025
విజయవాడ: ఈ నెల 7న మెగా జాబ్ మేళా

విజయవాడలోని SRR కళాశాలలో ఈ నెల 7న APSSDC ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 30 కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు హాజరవ్వాలని, ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.10-35 వేల వేతనం ఉంటుందన్నారు. https://naipunyam.ap.gov.in/లో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
News November 1, 2025
ఎన్టీఆర్: CRDA జాబ్ మేళాలో 141 మందికి ఉద్యోగాలు

తుళ్లూరులో CRDA, APSSDC ఆధ్వర్యంలో శుక్రవారం 10 కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాలో 141 మందికి ఉద్యోగాలు లభించాయని కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. అమరావతిలో 380 ఉద్యోగాల భర్తీకై నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 627 మంది హాజరవ్వగా 141 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, మరో 43 మంది ఇంటర్వ్యూలోని తదుపరి రౌండ్లకు ఎంపికయ్యారని కమిషనర్ పేర్కొన్నారు.
News November 1, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

✦ జూబ్లీహిల్స్ బైపోల్: ఇవాళ రాత్రి బోరబండ, ఎర్రగడ్డలో CM రేవంత్ ప్రచారం
✦ నేడు సా.6 గంటలకు రహమత్ నగర్‌లో KTR రోడ్ షో
✦ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కొత్తగా 75 PG సీట్లు మంజూరు చేసిన NMC.. 1390కి చేరిన సీట్ల సంఖ్య
✦ భవిత కేంద్రాల్లో పని చేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకూ TET మినహాయింపు కుదరదు: హైకోర్టు
✦ గద్వాల(D) ధర్మవరం BC హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 86 మంది విద్యార్థులకు అస్వస్థత


