News March 7, 2025

చిట్యాల: ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

image

ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రబెల్లి విజయ-దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఎర్రబెల్లి పల్లవి(19) ఉన్నారు. పల్లవి, ఆమె తల్లి విజయ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చు అయ్యాయని.. సరిపడా డబ్బులు లేకపోవడంతో మనస్థాపానికి గురయ్యేదని వివరించారు.

Similar News

News March 1, 2026

ఖమేనీ చనిపోయారు: ట్రంప్

image

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తిగా పేర్కొన్నారు. ఈ చావుతో ఇరాన్ పౌరులతో పాటు అమెరికన్లు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందన్నారు. తమ నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని అన్నారు. ఇరాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడి పౌరులకు ఇది అతిపెద్ద అవకాశమన్న ట్రంప్.. దాడులు మరో వారం కొనసాగుతాయన్నారు.

News March 1, 2026

ఏలూరు: కార్మిక శాఖ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏలూరు జిల్లాలో 18 ఏళ్లు నిండిన కార్మికులు వివాహ కానుక, ప్రసూతి ప్రయోజన, సహజ మరణ ఉపశమన, అంత్యక్రియల వ్యయ సహాయ పథకాలకు దరఖాస్తు చేయాలని ఉప కార్మిక డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటికే ఈ పథకాలను నమోదు చేసుకున్న కార్మికులు వివరాలను (నవీకరణ) అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా లేబర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News March 1, 2026

సండేను ఫండేగా మార్చుకోండి

image

వారమంతా బిజీగా గడిపిన చాలా మందికి సండే అంటే రెస్ట్‌డే. ఎక్కువసేపు నిద్రపోయేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఆదివారాన్ని ప్రొడక్టివ్‌గా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుటుంబంతో సమయం గడపడం, బుక్ రీడింగ్, వాకింగ్‌, గదిని సర్దుకోవడం, ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం వంటివి చేస్తే స్ట్రెస్ తగ్గుతుందని అంటున్నారు. దీంతో పాటు వచ్చేవారంలో చేయాల్సిన పనులపై ప్లాన్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.