News February 28, 2025
చిట్యాల: కుటుంబ సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి మృతి

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సతీశ్ ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోందిజ ఈ క్రమంలో మద్యం తాగి ఉరేసుకొని చనిపోయాడు. భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరేసుకొని చనిపోయాడని మృతుడి తండ్రి కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
Similar News
News November 18, 2025
పోక్సో కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష: ASF SP

మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన, అత్యాచారయత్నం కేసులో కోర్టు నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.12,000 జరిమానా విధించినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. 2020లో బెజ్జూర్‌లో జరిగిన ఈ ఘటనపై నమోదు చేసిన కేసును ప్రత్యేక కోర్టు పరిశీలించి నిందితులకు శిక్ష విధించిందన్నారు.
News November 18, 2025
బాపట్ల: ‘కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత’

పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ఆధారంగా ఇసుక రేవులు అనుమతించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం బాపట్ల కలెక్టరేట్‌లో జరిగింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత ఉందని కలెక్టర్ చెప్పారు. కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రేవులో 14.960 హెక్టార్ల ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు. స్థానికుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు.
News November 18, 2025
పార్వతీపురం జిల్లాలో 1,22,260 మంది అర్హులు: కలెక్టర్

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా రూ.83.87 కోట్ల నిధులు 1,22,260 మంది రైతుల ఖాతాల్లో బుధవారం జమ కానున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. పాలకొండ నియోజకవర్గంలో రూ.22.75 కోట్లు, కురుపాం నియోజకవర్గంలో రూ.26.94 కోట్లు, పార్వతీపురం నియోజకవర్గంలో రూ.17.20 కోట్లు, సాలూరు నియోజకవర్గంలో రూ.16.98 కోట్లు మొత్తం రూ.83.87 కోట్ల నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు.


