News March 9, 2025
చిట్యాల సమీపంలో యాక్సిడెంట్

చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో యాక్సిడెంట్ జరిగింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఉదయం నార్కెట్ పల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు.
Similar News
News March 10, 2025
నల్గొండ: ఎమ్మెల్సీ సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖరారు

శాసనమండలి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. ఈ మేరకు హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10.00 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
News March 10, 2025
నల్గొండ: 2023లో టికెట్ త్యాగం.. నేడు ఎమ్మెల్సీగా అవకాశం

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్ గ్రామానికి చెందిన అద్దంకి దయాకర్ అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అద్దంకి దయాకర్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ,2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్‌ను త్యాగం చేశారు. 4 ఏప్రిల్ 1972వ సంవత్సరంలో అద్దంకి జన్మించారు.
News March 10, 2025
నల్గొండ: కప్పు కొట్టిన భారత్‌కు మాజీ ఎమ్మెల్యే అభినందనలు

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియాకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. NZతో మరోసారి ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది భారత్. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా టీమ్ ఇండియాను గెలిపించారు.