News January 14, 2026
చిట్వేల్‌లో సంక్రాంతి పండుగ.. కుటుంబం అంతా ఒకే చోట భోజనం..!

సంక్రాంతి పండుగతో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని చిట్వేల్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. గత 50 ఏళ్లుగా భోగి రోజున నలుగురు అన్నదమ్ముల కుటుంబాలు కలిసి సంయుక్త అరిటాకు భోజనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది 46 మంది కుటుంబ సభ్యులు పాల్గొనగా, హైదరాబాదు, బెంగళూరు, విదేశాల్లో ఉన్నవారు కూడా భోగి రోజున కలుస్తారన్నారు. దీంతో కుటుంబాల్లో ప్రేమానురాగాలు మరింత బలపడతాయన్నారు.
Similar News
News February 18, 2026
HYDలో కొత్త ట్రెండ్.. డిజిటల్ ‘Raw’నెస్

కలర్ ఫుల్ ఫిల్టర్ల కాలం చెల్లింది. ఇప్పుడు అంతా పక్కా లోకల్. గూగుల్ సెర్చ్‌కి టాటా చెప్పేసి GEN Z ఇన్‌స్టా రీల్స్‌లోనే బిర్యానీ అడ్రస్‌లు వెతుకుతున్నారు. ఎడిటింగ్ హడావిడి లేని అచ్చమైన ‘డిజిటల్ రానెస్’ వీడియోలకే ఇప్పుడు కిరాక్ రెస్పాన్స్. షో-ఆఫ్ కంటే కళ్ల ముందు కనిపించే నిజాయతీకే జనం ఫిదా అవుతున్నారు. గల్లీలో తీసిన అసలైన ఎమోషన్‌కే లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?
News February 18, 2026
అభిని పక్కనబెట్టి సంజూను తీసుకోవాలని డిమాండ్లు

అభిషేక్ శర్మ గత 7 అంతర్జాతీయ టీ20ల్లో 5 సార్లు (ఈ WCలో 3 సార్లు) డకౌట్ కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి మెగా టోర్నీల్లో ఇంత నిర్లక్ష్యంగా ఆడటం ఏంటని టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కీలకమైన సూపర్-8లో అభిని పక్కనబెట్టి సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News February 18, 2026
చీరాలలో 10 నిమిషాల్లోనే పోగొట్టుకున్న డబ్బు వెనక్కి!

చీరాల గడియార స్తంభం సెంటర్‌లోని అభిరుచి రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నగదు డ్రా చేశారు. హోటల్‌కు వస్తుండగా రూ.20వేల నోట్ల కట్ట జారిపోయింది. బాధితుడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో సీసీ ఫుటేజ్ పరిశీలించి రవి షాపింగ్ మాల్ సమీపంలో డబ్బు తీసుకెళ్లిన వ్యక్తిని 10 నిమిషాల్లో గుర్తించి పట్టుకున్నారు. నగదును బాధితుడికి అప్పగించారు.


