News August 26, 2025
చిట్వేల్ అడవుల్లో పెద్దపులి

చిట్వేల్, వెలిగొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. తిరుపతిలోని అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. మార్చిలో పెద్దపులి జాడలు కనిపించాయని చెప్పారు. సీసీ కెమెరాల్లోనూ పెద్దపులి సంచార దృశ్యాలు రికార్డు అయ్యాయని తెలిపారు. అటవీ శివారు ప్రాంతంలోని గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News August 26, 2025
MGUలో బి ఫార్మసీ, లా, బిఈడి కళాశాలలు!!

నల్గొండ MGUలో కొత్తగా ఫార్మసీ, లా, ఎడ్యుకేషన్ కళాశాలలను నెలకొల్పనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిసింది. ఈ వర్సిటీ పరిధిలో బీఫార్మసీ, లా, బీఈడీ కళాశాలలు ఉండటం.. వాటిని పర్యవేక్షించేందుకు MGUలో అందుకు సంబంధించిన కళాశాలలు లేక పోవడంతో నిపుణుల కోసం ఇతర వర్సిటీలపై ఆధారపడాల్సి వస్తోంది. కళాశాలల మంజూరుపై వాడపల్లి నవీన్ హర్ష వ్యక్తం చేశారు.
News August 26, 2025
నేవీలో ఉద్యోగం సాధించిన గొల్లమాడ యువకుడు

నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన వంశీ ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించాడు. గ్రామానికి చెందిన రవి- రాధ దంపతుల పెద్ద కొడుకైన వంశీ మొదటి ప్రయత్నంలోనే నేవీలో మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. తండ్రి వ్యవసాయం చేస్తూ, తల్లి బీడీలు చుట్టి బిడ్డను చదివించారు. వంశీ కష్టపడి చదివి ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News August 26, 2025
పార్వతీపురం: ‘స్థలాలు గుర్తించి గ్రౌండింగ్ చేయండి’

జిల్లాలో పరిపాలన ఆమోదం పొందని పంచాయతీ భవనాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి తక్షణమే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ పంచాయతీ రాజ్ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లను ఆదేశించారు. పార్వతీపురం జిల్లాకు 80 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా, 68 భవనాలకు పరిపాలన ఆమోదం మంజూరు చేశామన్నారు. మంగళవారం లోగా స్థలాలను గుర్తించి పరిపాలన ఆమోదం పొందాలని స్పష్టం చేశారు.