News October 21, 2025

చిత్తశుద్ధి, నీతి, నీజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది: CP

image

ప్రజల సేవ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు పాటుపడాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు.

Similar News

News October 21, 2025

కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

image

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.

News October 21, 2025

ములుగు: ఈ ఘటనకు 25 ఏళ్లు..!

image

ఏటూరునాగారంలోని పోలీస్ స్టేషన్‌ను 2001లో పేల్చివేత ఘటనలో మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ మందు పాత్రలు పెట్టి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులతో పాటు.. ఒక అటవీ అధికారి, పూజారి మృతి చెందాడు. ఆ సమయంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ విరోచితంగా పోరాడి నక్సల్స్ దాడిని ఎదురించారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. SHARE

News October 21, 2025

జూబ్లీహిల్స్: అనుమానమొస్తే అబ్జర్వర్లకు ఫిర్యాదు చేయవచ్చు!

image

జూబ్లీహిల్స్ బైపోల్స్ పరిశీలనకు ఈసీ అబ్జర్వర్లను నియమించింది. ముగ్గురు సీనియర్ అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, శాంతిభద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియజేయవచ్చు. జనరల్ అబ్జర్వర్: 92475 05728, పోలీస్ అబ్జర్వర్: 92475 05729, ఎక్స్ పెండేచర్ అబ్జర్వర్: 92475 05727 నంబర్లకు కాల్ చేయొచ్చు.