News December 4, 2024
చిత్తూరు:ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సుల నిర్వహణ
ఈ నెల 6 నుంచి 2025 జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో రెవెన్యూ మంత్రి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా సచివాలయం నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ హాజరయ్యారు.
Similar News
News December 5, 2024
చిత్తూరు: అభ్యంతరాలు ఉంటే తెలపండి
చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, నగర పాలకోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాష పండితులకు SA లుగా పదోన్నతులు కల్పిస్తూ సీనియారిటీ జాబితా విడుదల చేస్తామని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఎంఈఓ, డివైఈవో మెయిల్ ద్వారా ఈ జాబితా పంపించామన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో 7వ తేదీ సాయంత్రం 4 లోపు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News December 4, 2024
తిరుపతి: 1535 మందితో బందోబస్తు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. 1535 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పుణ్యమి గడియలు రోజంతా ఉంటుంది కాబట్టి భక్తులు ఆతృత చెందరాదన్నారు. విడతలవారీగా భక్తులు పుణ్యస్నానం ఆచరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తొక్కిసలాటకు తావు లేకుండా ప్రతి భక్తుడు స్నానం ఆచరించేలా చూస్తామన్నారు.
News December 4, 2024
చిత్తూరులో విషాదం.. 12 ఏళ్ల బాలిక మృతి
బంగారుపాలెంలోని ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. శేషాపురానికి చెందిన గుణశ్రీ జ్వరంతో బాధపడుతుండగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంజక్షన్ వేశారు. కొంతసేపటికే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.